8 April, 2026 | 9:41 PM

జీవితంపై విరక్తితో యువకుని మృతి

08-04-2026 08:10 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): జీవితంపై విరక్తితో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామంలో చోటుచేసుకుంది. నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం అచ్చంపేట గ్రామానికి చెందిన న్యాయపు సంగమేశ్వర్,అనే యువకుడు జీవితంపై విరక్తితో నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన తెలిపారు. వదిన తండ్రి న్యాయపు హనుమాన్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.