4 August, 2026 | 8:50 PM

ఘనంగా తల్లిపాల వారోత్సవాలు

03-08-2026 06:03 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో సోమవారం తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సంపతీ శంకరమ్మ మాట్లాడుతూ... శిశువు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తల్లిపాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. పుట్టినప్పటి నుంచి తొలి ఆరు నెలల వరకు శిశువుకు పూర్తిగా తల్లిపాలు మాత్రమే అందించడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి, అనేక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని తెలిపారు.

తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారమని, ప్రతి తల్లి వాటి ప్రాముఖ్యతను గుర్తించి పిల్లలకు తప్పనిసరిగా అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బాల్సని ప్రణయ్ గౌడ్, గ్రామ కార్యదర్శి రూత్త అశోక్, వార్డు సభ్యులు, అంగన్‌వాడీ టీచర్లు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు. తల్లిపాల ప్రాధాన్యంపై అవగాహన కల్పిస్తూ ఆరోగ్య సూచనలు అందించారు.