అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
పాపన్నపేట: అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి(Young man dies) చెందిన సంఘటన మండలంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్(SI Srinivas Goud) కథనం ప్రకారం.. కొత్తపల్లి గ్రామానికి చెందిన గుడ్డింగారి రాజు(25) ఆటో డ్రైవర్ గా పని చేస్తూ జీవిస్తున్నాడు. శుక్రవారం ఉదయం సమయంలో పని ఉందని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. శుక్రవారం రాత్రి సమయంలో శానాయిపల్లి శివారులో రోడ్డుపై తలకు గాయాలతో పడి ఉన్నాడు. అటుగా వెళ్లిన స్థానికులు గమనించి కుటుంబీకులు, పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. రాజును ఎవరైనా హత్య చేసి ఉంటారా లేదా ఏదైనా వాహనం ఢీ కొట్టిందా అనేది తెలియాల్సి ఉంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించి మృతుడి తండ్రి సిద్ధిరాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.