27 February, 2026 | 8:12 PM

రక్తదానం చేసి ప్రాణ రక్షకుడు యువకుడు

27-02-2026 04:31 PM

వాంకిడి,(విజయక్రాంతి): వాంకిడి మండలంలోని ఖిరిడి గ్రామానికి చెందిన నారాయణ (65)కు అత్యవసరంగా AB+ రక్తం అవసరమని తెలిసిన వెంటనే శుక్రవారం ఆసిఫాబాద్ రక్తనిధి కేంద్రానికి చేరుకుని డైలీ క్రికెట్ యూత్ సభ్యుడు మచ్చ సాయి పవన్ నాలుగోసారి రక్తదానం చేసి మానవతా దృక్పథాన్ని చాటాడు.

అతని సేవాభావాన్ని నారాయణ కుటుంబ సభ్యులు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. సమాజ సేవలో వాంకిడి డైలీ క్రికెట్ యూత్ ఎల్లప్పుడూ ముందుంటుందని సంఘం అధ్యక్షుడు ఎంగలి రాకేష్ కుమార్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం అవసరమైతే 9030888246 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.