calender_icon.png 20 January, 2026 | 9:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదవశాత్తు బావిలో పడి యువతి మృతి

29-08-2024 03:14:18 PM

కొత్తగూడెం, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక పరిధిలోనే గాంధీ నగర్ కు చెందిన కొత్తూరు ఆదిలక్ష్మి గురువారం ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందింది. తండ్రి కొత్తూరు యాదగిరి కథనం ప్రకారం ఆదిలక్ష్మి ఉదయం బావి దగ్గర నీళ్లు తోడుతుండగా మూర్చ రావడంతో ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిందని తెలిపారు. శవాన్ని వెలికి తీసి శవ పరీక్ష నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.