30 June, 2026 | 11:29 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

జగన్ వాహనం ఢీకొనే సింగయ్య మృతి.. వీడియో దృశ్యాల్లో స్పష్టం

22-06-2025 11:40 AM

అమరావతి: ఇటీవల ఆత్మహత్య చేసుకుని మరణించిన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి పోలీసుల ఆంక్షల మధ్య, వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) బుధవారం పల్నాడు జిల్లాలోని రెంటపాళ్ల గ్రామాన్ని సందర్శించారు. జగన్ పర్యటనలో సింగయ్య మృతికి సంబంధించి మరో వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. జగన్ కారు ముందు టైర్ కిందపడి వృద్ధుడు సింగయ్య మరణించినట్లు దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కారు కింద సింగయ్య పడినట్లు గుర్తించి అప్రమత్తం చేసినా జగన్ పట్టించుకోకుండా ముందుకెళ్లినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కారు కింద వృద్ధుడు పడినట్లు స్థానికులు అరిచినా జగన్, వైసీపీ శ్రేణలు పట్టించుకోలేదు. ఇటీవల జగన్ రెంటపాళ్ల పర్యటనలో కారు కిందపడి సింగయ్య అనే వృద్ధుడు మరణించాడు. జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్ పల్నాడులోని రెంటపాళ్లకి వెళుతుండగా గుంటూరు జిల్లా ఏటుకూరు సమీపంలోని హైవేపై ఈ ప్రమాదం జరిగింది.