12 August, 2026 | 9:09 PM

ప్రభుత్వం మొండివైఖరి వీడాలి

12-08-2026 06:04 PM

టెండర్లు తక్షణమే రద్దు చేయాలి

టీజేపీఈజేఏసీ డిమాండ్

42 రోజుకు చేరిన ఉద్యోగుల నిరసన

గణపురం,(విజయక్రాంతి): వైటీపీఎస్ టెండర్ల ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని టీజేపీఈజేఏసీ డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసన కార్యక్రమం బుధవారానికి 42 రోజుకు చేరింది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ... ప్రభుత్వం ఇప్పటి కైనా తన మొండివైఖరిని వీడి, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) ప్రైవేటీకరణ టెండర్లను తక్షణమే వెసక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేటీపీపీ ప్రధాన గేటు పద్ద విద్యుత్ ఇంజినీర్లు, ఉద్యోగులు సల్ల బ్యాడ్జీలు ధ రించి, ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్ర మంలో వివిధ విద్యుత్ ఉద్యోగ, ఇంజినీరింగ్ సంఘాల నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.