12 August, 2026 | 10:38 PM

మాల్తుమ్మెద గ్రామంలో బోర్వెల్ రీఛార్జ్ పిట్ పరిశీలించిన జెడ్పి సీఈవో

12-08-2026 08:57 PM

నాగిరెడ్డిపేట్,ఆగస్టు 12 (విజయక్రాంతి): మండలంలోని మాల్తుమ్మెద గ్రామంలో గల బోర్వెల్ రీఛార్జ్ పిట్ను కామారెడ్డి జెడ్పి సీఈవో చందర్ నాయక్ మంగళవారం పరిశీలించి ప్రకృతి వనంలో మొక్కలు నాటి నీళ్ళు పోశారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించారు. పోచారం ప్రాజెక్టును సందర్శించి ప్రాజెక్టు అందాలను తిలకించారు. ఈ సందర్భంగా జెడ్పిసిఈఓ చందర్ నాయక్ మాట్లాడుతూ... బోర్ వెల్ రీఛార్జిలు,ఫామ్ పౌండ్లు త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

ప్లాంటేషన్ మండలకు ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని తెలిపారు. మండలంలోని గ్రామానికి రెండు వేల, చొప్పున మొత్తం మండలంలో 54 వేల,, ప్లాంటేషన్ చేయవలసిందిగా ఇప్పటివరకు 46000  ప్లాంటేషన్ పూర్తయిందని అధికారులు జెడ్పీ సీఈవో చందర్ నాయక్ వివరాలు వెల్లడించారు. పోచారం ప్రాజెక్టు చరిత్రను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగాధర్, ఏపీవో సక్కుబాయి, ఎంపిఓ ప్రభాకర్ చారి, ఈసీ సాయిలు, మాల్తుమ్మెద, పోచారం గ్రామ సర్పంచులు పుప్పాల సాయిలు, సంజీవరావు, కార్యదర్శి అశోక్, ఫీల్డ్ అసిస్టెంట్లు నర్సింలు, సాయిలు స్వప్న తదితరులు పాల్గొన్నారు.