12 August, 2026 | 10:38 PM

అధికారిక లాంఛనాలతో ఎఫ్బీఓ నవీన్ నాయక్ అంత్యక్రియలు

12-08-2026 09:01 PM

నవీన్ నాయక్ కు ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్

కారేపల్లి బస్టాండ్ సెంటర్ నుండి వెంకటియ తండా వరకు భారీ ర్యాలీ

కారేపల్లి,(విజయక్రాంతి): సింగరేణి మండలం వెంకటయ్య తండా గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ బానోత్ దేవ్లా నాయక్ చిన్న కుమారుడు బానోత్ నవీన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ డివిజన్ బూరగంపాడు మండలంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తూ మంగళవారం రాత్రి వేటగాళ్ల ఉచ్చుకు బలై కరెంటు షాక్ తో మృతి చెందారు. వారి వృత్తి పట్ల వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

వారి తండ్రి అయిన మాజీ ఎంపీపీ దేవ్లా నాయక్, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కారేపల్లి బస్టాండ్ సెంటర్ నుండి మండల వాసులతో బైక్ ర్యాలీగా వచ్చి నవీన్ నాయక్ కు ఘనమైన నివాళులు అర్పించారు. అలాగే సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రభుత్వం నుండి రావాల్సిన ఎక్స్ గ్రేషియాను తక్షణమే అందించవలసిందిగా వారిని కోరుతూ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ తో మాట్లాడి విధుల్లో ప్రాణాలు కోల్పోయిన బీట్ ఆఫీసర్ నవీన్ కు అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించాలి.

కోరగా మంత్రి సిఫార్సుతో మృతి చెందిన నవీన్ నాయక్ కు అధికారీక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం శాసనసభ్యులు రాందాస్ నాయక్ మృతి చెందిన ఎఫ్ బి ఓ నవీన్ నాయక్ పాడేమోసి  వారి కుటుంబ సభ్యుల పై ఉన్న ప్రేమను చాటుకున్నారు. వారి ఆదేశాలతో నవీన్ నాయక్ అంత్యక్రియలను అధికారిక లాంచనాలతో చేశారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ శాఖ అధికారులు, వివిధ పార్టీల నాయకులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.