29 July, 2026 | 9:03 AM

యుగంధర్ అకాల మరణం అత్యంత బాధాకరం

29-07-2026 08:26 AM

సుజాతనగర్(విజయక్రాంతి): ఎంతో మంచి మనసున్న వ్యక్తిగా, అందరితోఆప్యాయంగా మెలుగుతూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన అభిమానాన్నిసంపాదించుకున్న చింతలపూడి యుగంధర్ గుండెపోటుతో మంగళవారం అకాల మృతి చెందారు. సుజాతనగర్ ప్రాంతవాసులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. యుగంధర్ ఇక మన మధ్య లేరనే విషాద వార్త ఎంతో కలచివేసింది. ఆయన అకాల మరణం కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, స్నేహితులక మాత్రమే కాకుండా సుజాతనగర్ ప్రజలందరికీ తీరని లోటుఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ, అందరితో స్నేహభావంతో మెలిగిన ఒక మంచి మనిషిని, ఆత్మీయుడిని కోల్పోవడం ఎంతో విషాదకరం అని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

ఆయనతో మనకు ఉన్న అనుబంధం, ఆయనతో గడిపిన మధుర జ్ఞాపకాలు ఎప్పటికీ మన హృదయాల్లోచిరస్థాయిగా నిలిచిపోతాయనీ ఆయన బంధుమిత్రులు స్నేహితులు ఆయన సేవలను కొనియాడారు.బి యుగంధర్  పవిత్రఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు  ప్రగాఢ సానుభూతిహృదయపూర్వక సంతాపాన్ని తెలియజేశారు. ఈ అపారమైన విషాదాన్నితట్టుకునే మనోధైర్యాన్ని ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని కోరారు. యుగంధర్ భౌతికయాన్ని సందర్శించి ప్రగాట సానుభూతిని తెలిపిన వారిలో సుజాతకర ప్రాంత రాజకీయ నేతలు స్నేహితులు పుర ప్రముఖులు క్రీడాకారులు, సహ ఉద్యోగులు ఉన్నారు.