జోనల్ క్రీడల్లో సత్తా చాటిన విద్యార్థులు
భైంసా,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జోనల్ స్థాయి(Joint Adilabad Zonal Sports) అండర్-14, అండర్-17 క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. అండర్-14 విభాగంలో ఎంపికైన విద్యార్థులు నిర్మల్ జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. అండర్-17 విభాగంలో ఎంపికైన విద్యార్థులు రంగారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్జీఎఫ్ సెక్రటరీ లక్ష్మణ్(SGF Secretary Laxman), డీజీపేట కార్యదర్శి వన్నెల భూమన్న, కోశాధికారి నచ్చేందర్, జాయింట్ సెక్రటరీ పోశెట్టి, రగ్బీ అసోసియేషన్ కార్యదర్శి భూమేష్, అధ్యక్షులు విద్యాసాగర్, చౌటుప్పల్ అసోసియేషన్ కార్యదర్శి అన్నపూర్ణ, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు రమణారావు, బుచ్చి రామారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను నిర్వాహకులు అభినందించారు. రాబోయే పోటీల్లోనూ మంచి ప్రతిభ కనబరిచి జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.