‘స్లమ్ డాగ్’ నుంచి జుబైదా వచ్చింది!
28-09-2026 | 05:25am
దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో విజయ్ సేతుపతి కాంబోలో వస్తున్న పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ తమ పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై జేబీ నారాయణరావు కొండ్రొల్లా జేబీ మోషన్ పిక్చర్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్‌గా నటిస్తుండగా, టబు పవర్ ఫుల్ రోల్ చేస్తున్నారు. దునియా విజయ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. బ్ర హ్మాజీ, వీటీవీ గణేశ్, వెటరన్‌నటి జరీనా వహాబ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆమె పాత్రను జుబైదాగా మేకర్స్ పరిచయం చేశారు. ప్రేమతో కూడిన హృదయం.. పోరాటాలతో నిండిన జీవితం అంటూ రివిల్ చేసిన ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది.