ఆమ్ ఆద్మీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

26-11-2026 | 05:05pm

నిర్మల్ నవంబర్ 26 ( విజయ క్రాంతి): ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) (ఆప్) 14వ ఆవిర్భావ దినోత్సవ(Foundation Day) వేడుకలను జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత రాజ్యాంగ పీఠికను నాయకులు, కార్యకర్తలు సామూహికంగా పఠించారు.

రాజ్యాంగం నిర్దేశించిన విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి, సమానత్వం, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బి. శ్రీనివాస్, కోశాధికారి అబ్దుల్ సాధిక్, ప్రధాన కార్యదర్శి సి.హెచ్. వినోద్ కుమార్, నియోజకవర్గ ఇన్చార్జి మెరుగు రాజన్న, అధికార ప్రతినిధి వసంత్ రావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు