రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్‌కు ఎమ్మెల్యే నివాళులు
మల్లాపూర్, నవంబర్ 26 (విజయక్రాంతి): 77వ రాజ్యాంగ దినోత్సవాన్ని(Constitution Day) పురస్కరించుకొని మల్లాపూర్ మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్(B. R. Ambedkar) విగ్రహానికి కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంబేద్కర్ దేశానికి అందించిన రాజ్యాంగ సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సోదరభావం వంటి మౌలిక విలువలను వివరించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ తెలుసుకోవడంతో పాటు, తమ విధులను కూడా బాధ్యతగా నిర్వర్తించాలని సూచించారు.అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ రాజ్యాంగ స్ఫూర్తితో సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, సందిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ముద్దం శరత్, ప్రసాద్, ప్రవీణ్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.