ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తిని పాటించాలి
ముకరంపుర, నవంబర్ 26(విజయ క్రాంతి): దేశంలోని ప్రతి పౌరుడు రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలని, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజ్యాంగ దినోత్సవం(Constitution Day) సందర్భంగా కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడారు
1949 నవంబర్ 26 న రాజ్యాంగాన్ని అంబేద్కర్ పూర్తి చేసి అందజేశారని, అందరికీ సమాన హక్కులు కల్పించి, ప్రజాస్వామ్య స్ఫూర్తితో, ముందుకు సాగుతున్న ఘనత అంబేద్కర్ కే దక్కుతుందని అన్నారు. ఈ రోజు దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగడానికి దేశ ప్రజలు కుల మత భేదం లేకుండా జీవించడానికి ఈ రాజ్యాంగమే కారణం అని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.