బతుకమ్మ ఆడుతున్న మహిళలు

21-10-2026 | 04:48pm

ఓలా గ్రామంలో బతుకమ్మ సంబరాలు 

భైంసా, అక్టోబర్ 21 (విజయక్రాంతి): కుంటాల మండలంలోని ఓలా గ్రామంలో బుధవారం బతుకమ్మ సంబరాలు(Bathukamma Celebrations) ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ప్రతిష్టించిన దుర్గామాత శోభయాత్ర నిర్వహించి మహిళలు బతుకమ్మలతో ఉత్సవ ఊరేగింపులో పాల్గొన్నారు. జారుడు గుంజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఉత్సాహంగా ఉట్టిగొట్టే కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రవి బీడీసీ అధ్యక్షులు నర్సింలు ఐక్య రెడ్డి నాలుగు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు