దళితులు అంటే బీఆర్ఎస్ పార్టీకి గౌరవం లేదు

08-09-2026 | 07:33pm

ఖానాపూర్ కాంగ్రెస్ మండలాధ్యక్షులు జంగిలి శంకర్

ఖానాపూర్ (విజయక్రాంతి): రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ(BRS party)కి దళితులపై కొంచెం కూడా గౌరవం లేదని దానికి నిదర్శనమే సోమవారం అసెంబ్లీ వద్ద ఆ పార్టీ ఎమ్మెల్సీ అసెంబ్లీ స్పీకర్(Assembly Speaker)పై తీవ్రమైన పదజాలం ప్రయోగించడం అని ఖానాపూర్ కాంగ్రెస్ పార్టీ(Congress Party) మండల అధ్యక్షులు జంగిలి శంకర్ అన్నారు. ఈ మేరకు నిర్మల్ జిల్లా ఖానాపూర్(Khanapur) మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు తెలంగాణ చౌకు వద్ద నిరసన ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో దొరలకు దళితులు అంటే చిన్న చూపుగా ఉందని దుయ్యబట్టారు.

ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు రాజుర సత్యం ,అధికార ప్రతినిధి దొనికేని దయానంద్, కార్యదర్శి అంకం రాజేందర్, పట్టణద్యక్షులు గొర్రె గంగాధర్,పిఎసిఎస్ చైర్మన్ ఆమంద శ్రీనివాస్, ఆత్మ కమిటీ చైర్మన్ తోట సత్యం, ఏఎంసీ వైస్ చైర్మన్ అబ్దుల్ మజీద్, కౌన్సిలర్ నిమ్మల రమేష్ ,సర్పంచులు రాజు నాయక్ ,సచిన్ ,ప్రశాంత్ రెడ్డి ,గోపి నాయక్ ,చింతల మల్లేష్ ,శంకర్, నరేష్ ,ధోనికేని సాగర్ ,వీరేష్, రఘుపతి రెడ్డి ,గుడాల రాజన్న, సంగర్తి రాజన్న ,అశోక్, షబ్బీర్, గంగ నరసయ్య, దేవతి రాజేశ్వర్, అమనులా, జహీర్ ,మధిర సత్యనారాయణ ,మడి గల గంగాధర్, సుజాత, రామా దేవి, పలువురు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు