విశ్రాంత పద్మశాలి ఉద్యోగులకు సన్మానం
13-09-2026 | 08:23pm
ఖానాపూర్ ( విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని నగర్ పద్మశాలి సంఘ(Padmasali Sangha) భవనంలో ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన పద్మశాలి ఉద్యోగులు నామని ప్రభాకర్ గోగుర్ల శ్రీనివాస్ గార్లను ప్రియదర్శిని నగర్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు ఆడెపు సుధాకర్, ప్రధాన కార్యదర్శి జల్దా రాజేశ్వర్, కోశాధికారి ఎడెల్లి రాజేశ్వర్, తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షులు బూర ఉమాశంకర్ మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు.