ఒకవైపు గుడుంబా.. మరోవైపు మహారాష్ట్ర మద్యం
- కుంటాల కేంద్రంగా రవాణా
- హోటల్, దాబా సిట్టింగ్
- గ్రామాల్లో యథేచ్ఛగా విక్రయాలు
- పట్టించుకోని పోలీసులు
భైంసా నవంబర్ 24 (విజయక్రాంతి): కుంటాల మండలంలోని(Kuntala Mandal) సరిహద్దు గ్రామాల్లో యదేచ్చగా మహారాష్ట్ర మద్యంతో పాటు, గుడుంబా విక్రయాలు జోరుగా సాగుతున్నట్టు తెలుస్తుంది. మహారాష్ట్ర మద్యం(Maharashtra liquor), గుడుంబా నియంత్రణపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నామని ప్రకటిస్తున్న సరిహద్దు గ్రామాల్లో ప్రతిరోజు మహారాష్ట్ర మద్యం, గుడుంబా అమ్మకాలు(Sale of illicit liquor) జోరుగా జరుగుతున్న సంబంధిత పోలీసులు ఎక్కడ కూడా కనీస చర్యలు తీసుకోవడం లేదు.
కుంటాల మండలంలోని పలు గ్రామాలు మహారాష్ట్ర సరిహద్దులో ఉండడంతో బంధుత్వం ఉండడంతో మహారాష్ట్ర మద్యం కుంటల మండల కేంద్రంగా పలు గ్రామాలకు సరఫరా చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. కుంటాల మండలంలోని అంబుగమ్, దౌనెల్లి తండా, గొల్లమడ వైపు నుంచి కూడా కుబీర్ లోని రంగా శివుని తాండ ల ద్వారా కుంటాల మండలంలోని పలు గ్రామాలకు మహారాష్ట్రలోని దేశిదారు మద్యం సరఫరా అవుతుంది.
మనమధ్యం వైన్ షాపుల ద్వారా విక్రయం జరుగుతుండగా ఇక్కడ మద్యం ధరలు ఎక్కువగా ఉండటంతో కొందరు గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహించేవారు మహారాష్ట్ర మద్యాన్ని గుర్తు చప్పుడు కాకుండా తీసుకొచ్చి వాటిపై లేబుల్ లను తొలగించి అమ్ముతున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి తీవ్ర గండి పడుతుంది. దీనికి తోడు పలు తండాలో గుడుంబావిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. నల్ల బెల్లం ఇప్పప్పు పటిక ఇతర రసాయన పదార్థాలతో గుడుంబా తయారుచేసి గ్రామంలో విక్రయిస్తున్నారు.
ప్రధానంగా గౌనెల్లి మేదన్పూర్ తండా అంబుగన్ తండా రంగస్మిని తండా తదితర ప్రాంతాల్లో గుడుంబా అభిప్రాయాలు ప్రతిరోజు జరుగుతున్న సంబంధిత పోలీసులు పట్టించుకోవడం ఆరోపణలు వినవస్తున్నాయి. ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో యువకులు చిన్న పిల్లలు గుడుంబా సేవించి రోడ్లపై హంగామా సృష్టిస్తున్నారు. ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీసుకుంటున్నారు. వ్యక్తిగత ఫిర్యాదు వస్తే తప్ప పోలీసులు వాటి గురించి పట్టించుకోవడం లేదు.
గ్రామాల్లో బెల్ట్ షాపులు గ్రామం మధ్యలోనే ఏర్పాటు చేసుకోవడం వల్ల మద్యం సేవించిన వారు రోడ్డుపై తుళ్ళూతూ పడిపోవడంతో గ్రామాల్లో బెల్ట్ షాపుల మధ్య న్యూసెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే పలు గ్రామాల్లో రోడ్లపై మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం వల్ల కలుగుతున్న ఇబ్బందులను ప్రజావాణిలో ప్రజలు ఫిర్యాదు చేసిన కంటి తూర్పు చర్యలు మాత్రమే చేపడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
కొన్ని కిరాణా దుకాణలు హోటల్లో కూడా మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారం ఉంది. ఇప్పటికైనా అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. దాబాల్లో కూడా కొందరు రెగ్యులర్ కస్టమర్లకు మద్యం సిట్టింగ్లు ఏర్పాటు చేస్తున్నారు.