విద్యార్థినిలు అప్రమత్తంగా ఉండాలి

30-10-2026 | 06:36pm

సీనియర్ సివిల్ జడ్జ్ జి రాధిక..

నిర్మల్ అక్టోబర్ 30 ( విజయ క్రాంతి): సమాజంలో జరుగుతున్న వివిధ సంఘటనల రీత్యా విద్యార్థినిలు అప్రమత్తంగా మసులుకోవాలని సీనియర్ సివిల్ జడ్జ్ ,డిస్టిక్ లీగల్  సర్వీస్ అథారిటీస్ సెక్రెటరీ జి రాధిక(G. Radhika, Secretary, Legal Services Authorities) ఉద్బోధించారు. శుక్రవారం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల(Government Girls' High School) సోమవార్పేట్ నిర్మల్  లో డిస్టిక్ లీగల్  సర్వీస్ అథారిటీస్ ఆధ్వర్యంలో జరిగిన సురక్షిత్ బచ్ పన్ అభియాన్ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

సమస్య ఎదురు కాక ముందే జాగ్రత్త పడాలని ఆమె సూచించారు. అపరిచిత వ్యక్తులతో మాట్లాడకూడదని, వారు ఏదైనా బహుమతులు ఇస్తే తీసుకోకూడదని తెలియజేశారు. తాత్కాలిక ఆనందాల కొరకు కాకుండా, విద్యార్థులు  తమ జీవిత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దాని సాధనకై కృషి చేయాలని అన్నారు. ఉపాధ్యాయులు, పోషకులు చెప్పే విషయాలను విద్యార్థులు అనుసరించాలని పేర్కొన్నారు .

ఏదైనా సమస్య ఎదురైనప్పుడు భయపడకుండా వెంటనే పోలీసు వారిని సంప్రదించాలని పేర్కొన్నారు.  విద్యార్థినిలు తమ చదువును మధ్యలోనే ఆపివేయకుండా ఉన్నత చదువుల వరకు కొనసాగించాలని, అప్పుడే ఉద్యోగ అవకాశాలు విస్తారంగా కనిపిస్తాయని వివరించారు. ప్రతి విషయం పట్ల పాజిటివ్ దృక్పథాన్ని ఏర్పరుచుకోవాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముడారపు పరమేశ్వర్, లీగల్ సెల్ చీఫ్ న్యాయవాది కే రాజలింగం, లీగల్ వాలంటరీ లోలం గంగన్న, కె ఎస్ గంగాధర్ ,చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీలత, ఇన్చార్జ్ హెచ్ఎమ్ ఎండి గౌసోద్దీన్ తో పాటు పట్టణ ఎస్సై ఉపాధ్యాయులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు