నిర్మల్ ఎమ్మెల్యే పరామర్శ

06-10-2026 | 06:24pm

నిర్మల్ అక్టోబర్ 6 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నిర్మల్ రూరల్ మండలం ముజ్గి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త శ్రీనివాస్, మేడిపల్లి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త మల్లారెడ్డిలను నిర్మల్ ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(MLA Alleti Maheshwar Reddy) పరామర్శించారు. ఇరువురి ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందేలా అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు