ఉద్యోగి ఉదారత.. స్వర్గలోకం రథం పంపిణీ

21-10-2026 | 04:40pm

నిర్మల్ అక్టోబర్ 21 ( విజయక్రాంతి) సోన్ మండలంలోని(Son Mandal) శాకెర గ్రామ మాజీ ఉప సర్పంచ్ సిరిగిరి వెంకటి, రాజమణి(Sirigiri Venkati, Rajamani) దంపతుల కుమారుడు కీర్తి శేషులు సిరిగిరి ఆర్థిక్( రైల్వే ఉద్యోగి) గ్రామానికి రూ. 3లక్షల విలువచేసే స్వర్గలోక రథం ను అందించారు. దసరా పండుగ రోజు కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థం ఈ రతాన్ని మాజీ ఉమ్మడి జిల్లా పరిషత్ అధ్యక్షులు శోభసత్యనారాయణ గౌడ్ గారి సమక్షంలో గ్రామ సర్పంచ్ లక్ష్మి అందించారు.

ఈ సందర్భంగా సత్యనారాయణ గౌడ్ గారు మాట్లాడుతూ గ్రామస్తుల సౌకర్యార్థం పుణ్య కార్యక్రమానికి సంబంధించిన స్వర్గలోక రథం అందజేయడం పట్ల వెంకటి రాజమణి కుటుంబ సభ్యులను అభినందించారు. రథాన్ని అందజేసిన వెంకటి కుటుంబ సభ్యులకు గ్రామ సర్పంచ్ మరియు వీడీసీ సభ్యులు  కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ సతీష్ రావు, గ్రామ పెద్దలు నర్సింగరావు, రాము,శంకర్, ఆశన్న గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు