ప్రత్యేక ఉపకరణాల నిర్ధారణ శిబిరం
11-09-2026 | 04:36pm
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష అభియాన్(District Education Department Comprehensive Education Abhiyan) ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఉపకారణాల శిబిరాన్ని శుక్రవారం టీఎన్జీవో కార్యాలయం(TNGO Office)లో నిర్వహించారు. ఈ శిబిరంలో దివ్యాంగ చిన్నారులను గుర్తించి, వారికి అవసరమైన వీల్ చైర్లు, ట్రై సైకిళ్లు,రోలేటర్లు, చంక కర్రలు, కృతిమ కాళ్ళు, వినికిడి యంత్రాలు, బ్రెయిలీ కిట్లు, TLM కిట్లు తదితర ఉపకరణాలను అందించేందుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మొత్తం 200 మంది విద్యార్థులు హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష జిల్లా అధికారులు, జిల్లా విలీన విద్య సమన్వయ కర్త ప్రవీణ్ కుమార్, ALIMCO ప్రతినిధులు ప్రత్యుష్, శివ, విలీన విద్య ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.