ఊట్‌పల్లి ఎల్లమ్మ ఆలయానికి నిధులు

26-09-2026 | 12:57pm

బోధన్, సెప్టెంబర్ 26 (విజయ క్రాంతి): బోధన్ నియోజకవర్గంలోని ఊట్‌పల్లి గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ మిగులు పనుల పూర్తి కోసం ఎస్‌డీఎఫ్‌ (SDF) నిధుల నుంచి రూ.2 లక్షలు మంజూరు చేసిన బోధన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డికి ఆలయ కమిటీ, గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయడం భక్తులకు, గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధి పట్ల చొరవ చూపి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అలాగే నిధుల మంజూరుకు సహకరించిన బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు ఆలయ కమిటీ తరఫున పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆలయ కమిటీ సభ్యులు ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు