హిందూ సంప్రదాయాలను గౌరవించే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంది
- సెంటిమెంట్ ను దెబ్బతియొద్దు
- రాజకీయంగా విడదీసే కుట్రలో భాగం
- లిపి లేని భాషగా గోర్ బంజారా బాధాకరం
- జాతిని కించ పరిస్తే సహించేది లేదు
- కమిషన్ అంటే ఫస్ట్ ట్రాక్ కోర్టు
- మోదీ జాతి బిడ్డలకు ఇచ్చిన గౌరవం
- జాతీయ ఎస్టి కమిటీ సభ్యులు హుస్సేన్ నాయక్
సిరికొండ, అక్టోబర్ 28( విజయ క్రాంతి ): హిందూ సంప్రదాయాలను(Hindu tradition) గౌరవించే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉందని జాతిని ఉద్దేశించి కించపరిచే విధంగా చేస్తే సహించేది లేదని జాతీయ ఎస్ టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్(Hussain Naik, Member of National Commission for Scheduled Tribes) అన్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని కొండాపూర్ గ్రామంలో బంజారా భవనం వద్ద జరిగిన గద్దె విషయంలో సర్పంచ్ తండా, గోప్య తండా ,గడ్డమీద తండా స్థానిక సర్పంచులు జాతీయ ఎస్ టీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో జాతీయ ఎస్ టి కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ కు సర్పంచులు సమస్య విన్నవించారు.దేశంలో గోర్ బంజారాలు 10కోట్ల మంది ఉన్నారని గుర్తు చేశారు. దేశంలో ఈ ఒకరు రెండు ముట్టుకోకూడదు అన్నారు. ఎవరి మతాలకు చెందిన గుళ్ళు, మసీదు,చర్చలు ,రెండవది పార్టీ జెండా , గద్దెలను ముట్టుకోకూడదనీ అన్నారు .
భారత దేశమే హిందూ దేశంగా ఉందని ఎవరో రాజకీయ లబ్ధి కోసం కులాల మతాల కోసం చిచ్చు రాజేస్తే గ్రామం నుంచి రాష్ట్రాలకు,దేశానికే పాకి దేశం అల్లకల్లోలం అవుతుందని పేర్కొన్నారు.జాతిని ఉద్దేశించి జరిగే కుట్రలను అడ్డుకొని శాంతి భద్రతల కాపాడే బాధ్యత అధికారులపై ఉందని లేని పక్షంలో ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుందన్నారు.
గుళ్ళ కోసం నేరుగా 2.5ఎకరాల భూమిని కేటాయించే అధికారం కలెక్టర్ కు ఉందని గుర్తు చేశారు. కమిషన్ ఏర్పాటు చేసింది వాజపేయి ప్రభుత్వమని బీజేపీ ప్రభుత్వం పీఎం మోడీ ఎస్సీ, ఎస్టి ఉన్న కమిషన్ ను ఎస్సీ, ఎస్టి వేరుగా చేసి బంజారాల కు ఉన్నత గౌరవం కల్పించినట్లు పేర్కొన్నారు. మోదీ దళిత బిడ్డను రాష్ట్ర పతిని చేసిన ఘనత ఆయనదని అన్నారు.
ట్రబల్ ఏరియా లో ఉన్న తనకు కమిషన్ చేసి బంజారా జాతి బిడ్డలకు అండగా నిలిచారని అన్నారు. సేవలాల్ జయంతి నీ దేశంలో ఒకే రోజు జరుపుకోవాలని పీఎం మోదీ ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు.దేశంలో ఎక్కువగా మాట్లాడే హిందీ భాష తరువాత గోర్ బంజారా భాషని అన్నారు. ఎక్కువగా మాట్లాడే భాషకు లిపి లేకపోవడం బాధాకరమని అన్నారు.
కమిషన్ అంటే ఫస్ట్ ట్రాక్ కోర్టు లాంటిదని ఆన్లైన్ లేదా,ఆఫ్ లైన్ ద్వారా ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కారం చూపుతామని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం జాతుల మధ్య కుట్ర చేసే ప్రక్రియ మానుకోవాలని, రెచ్చ గొట్టే వారిని బొక్కలో వేయాలని అధికారులకు ఆదేశించారు.జెండా దేవుడు సెంటిమెంట్ అని వాటిని ముట్టుకుంటే భస్మము అవుతారని అన్నారు.
స్థానిక సర్పంచ్ లు ప్రజల చేత గెలిచిన వారని సర్దుకొని సంజయించుకొని పని చేసుకోవాలని హితవు పలికారు.60గజాల జాగా కోసం సెంటిమెంట్ ను దెబ్బతిస్తే విషయం వేరేలా ఉంటుందని అందరు కలిసి మెలసి ఉండాలని అన్నారు. హైదరాబాద్ లో ఫిర్యాదుల కోసం త్వరలో కార్యాలయం ఓపెన్ చేస్తున్నట్లు చెప్పారు.
కార్యక్రమంలో ఆర్డీవో రాజేంద్ర కుమార్, ఎసిపి ప్రకాష్,తహసీల్దార్ రవీందర్, సీఐ రామన్, సర్పంచ్ లు మంజుల సంతోష్, శోభ జీవన్, తిరుపతి , బాల్ సింగ్,రామ్ సింగ్, రాoచందర్, మాన్ సింగ్ ,సరియ నాయక్,గంగాధర్, బన్నజి, దేశ్య నాయక్,బాల్ రాజ్,డాన్ సీను,వినోద్,వాసు,సంతోష్,రవి,రాములు నాయక్,లింభ , సీతారాం బంజారా నాయకులు తదితరులు పాల్గొన్నారు.