తరిగొప్పులలో రోడ్డు ఆక్రమణల తొలగింపు
16-10-2026 | 04:58pm
తరిగొప్పుల అక్టోబర్ 16 (విజయక్రాంతి):జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలో రోడ్డును ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను(Illegal constructions) అధికారులు శుక్రవారం తొలగించారు. మండల కేంద్రంలో ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందనే ఫిర్యాదులతో రెవెన్యూ, పంచాయతీ అధికారులు సంయుక్తంగా JCB సహాయంతో ఆక్రమణలను తొలగించారు. రోడ్డు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.