అయ్యప్ప స్వామి ఆశీస్సులతో సంతోషంగా ఉండాలి
సుల్తానాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని నీరుకుల్లా రోడ్డులో ఉన్న శ్రీశ్రీశ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు (Special Pooja) నిర్వహించారు.
ఆలయానికి చేరుకున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణకు అయ్యప్ప స్వాములు ఘన స్వాగతం పలికారు. అనంతరం శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. వర్షాలు (Rainfall) సమృద్ధిగా కురిసి పాడిపంటలు (Agriculture) బాగా పండాలని, స్వామివారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ 9వ వార్డు కౌన్సిలర్ తోరికొండ ప్రభాకర్, శంకరయ్య, రత్నం, ఆరేపల్లి రాహుల్, అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు...