కేటీఆర్‌పై కవిత డైరెక్ట్ అటాక్
బీఆర్ఎస్ పార్టీలో సోషల్ మీడియా (Social Media) వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఆయన సోదరి కవిత సంచలన ఆరోపణలు చేశారు. తన ఫొటోలను మార్ఫింగ్ (Photo Morphing) చేయిస్తూ, సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిస్తున్నారని ఆమె ఆరోపించారు.
దుబాయ్ కేంద్రంగా సోషల్ మీడియా కార్యకలాపాలను నిర్వహిస్తూ తనపై దుష్ప్రచారం (Propaganda) చేయిస్తున్నారని కవిత ఆరోపించారు. డబ్బు అహంకారంతో కేటీఆర్ దిగజారి ప్రవర్తిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. కేటీఆర్‌కు కూడా కూతురు ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, మహిళల పట్ల కనీస గౌరవం ఉండాలని ఘాటుగా వ్యాఖ్యానించారు.
కేటీఆర్‌పై కవిత చేసిన ఈ ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే బీఆర్ఎస్‌లో కొనసాగుతున్న అంతర్గత విభేదాల నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే, ఈ ఆరోపణలపై కేటీఆర్ స్పందన తెలియాల్సి ఉంది.