హైదరాబాద్‌కు కాంగ్రెస్ కొత్త ఇన్‌చార్జ్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల నూతన ఇన్‌చార్జ్ (State In-charge) బీఎం సందీప్ కుమార్ ఆదివారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచంద్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఏఐసీసీ మాజీ కార్యదర్శి సంపత్ కుమార్, ప్రోటోకాల్ చైర్మన్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఫయీమ్, రోహిన్ రెడ్డి, కిషోర్ రెడ్డి కూడా సందీప్ కుమార్‌కు స్వాగతం పలికారు.రెండు రోజుల పర్యటన (Two-day Visit)లో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన ఆయన గాంధీభవన్‌లో నిర్వహించనున్న పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (PAC) సమావేశంతో పాటు టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశాల్లో పాల్గొననున్నారు.
ఈ పర్యటనలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం (Organizational Structure), పార్టీ బలోపేతం, నాయకుల మధ్య సమన్వయం, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై నేతలతో చర్చించనున్నారు. నూతన ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలపై ఆయన నిర్వహిస్తున్న తొలి పర్యటనకు రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది.