ఐఫోన్ డిజైన్‌తో కొత్త ఫోన్.. ఫీచర్లు అదిరిపోయాయిగా!
రూ.10,999కే 7,000mAh బ్యాటరీ.. లావా కొత్త ఫోన్లో అదిరిపోయే ఫీచర్లు!
బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో భారతీయ బ్రాండ్ లావా(Lava Smart 4 Pro Launched) మరో కొత్త మోడల్‌తో వినియోగదారుల ముందుకొచ్చింది. Lava Smart 4 Pro పేరుతో విడుదలైన ఈ ఫోన్ ముఖ్యంగా భారీ Battery Capacityతో ఆకట్టుకుంటోంది. కేవలం రూ.10,999 ధరలోనే 7,000mAh బ్యాటరీని అందించడం ఈ Smartphoneలో ప్రధాన Highlight. దేశవ్యాప్తంగా ఉన్న Offline Retail Storesలో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ వెల్లడించింది.
ఐఫోన్ తరహా లుక్.. 90Hz డిస్ప్లే
డిజైన్ విషయంలో Lava Smart 4 Proకు ప్రత్యేక ఆకర్షణ ఉంది. ఫ్లాట్ ఎడ్జ్ బాడీ, వెనుకవైపు Camera Module ఐఫోన్ డిజైన్‌ను పోలి ఉంటాయి. అయితే బడ్జెట్ ధరకు అనుగుణంగా Polycarbonate Body, Waterdrop Notchను అందించారు. అంతేకాకుండా MIL-STD-810H Military Grade Certification ఉండటం మరో ప్రత్యేకత. ఇందులో 6.75 అంగుళాల HD+ Displayను అమర్చారు. 90Hz Refresh Rate సపోర్ట్‌తో స్క్రోలింగ్, వీడియోలు చూడటం, సాధారణ గేమింగ్ సమయంలో మెరుగైన అనుభూతి లభించనుంది.
7,000mAh బ్యాటరీ.. 8GB వరకు RAM
ఈ ఫోన్‌కు అతిపెద్ద బలం 7,000mAh Li-Ion Battery. దీనికి 18W Fast Charging Support, USB Type-C Portను జత చేశారు. పనితీరు కోసం UNISOC T610 Octa-Core Processorను ఉపయోగించారు. 4GB Physical RAMతో పాటు మరో 4GB Virtual RAM ఫీచర్ అందుబాటులో ఉంది. దీంతో మొత్తం 8GB వరకు RAM సామర్థ్యాన్ని పొందవచ్చు. ఇక 64GB Internal Storageను MicroSD Card ద్వారా 512GB వరకు Expand చేసుకునే అవకాశం కల్పించారు.
Android 16.. 13MP కెమెరా
ఫోటోగ్రఫీ కోసం వెనుకవైపు 13MP Main Camera, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5MP Front Camera ఉన్నాయి. ఈ Smartphone Android 16 Operating Systemపై పనిచేస్తుంది. అనవసరమైన యాప్స్ (Bloatware), ప్రకటనలు (Ads) ఉండవని కంపెనీ హామీ ఇస్తోంది. భద్రత కోసం Side-Mounted Fingerprint Sensor, Face Unlock ఫీచర్లను అందించారు. రెండేళ్ల పాటు Security Updates కూడా లభించనున్నాయి.
రెండు కలర్స్‌లో లభ్యం
Lava Smart 4 Pro నీలం బ్లూ, కోణార్క్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఫోన్‌పై ఒక సంవత్సరం Warrantyతో పాటు Doorstep Service సదుపాయాన్ని కూడా కంపెనీ ప్రకటించింది. తక్కువ ధరలో భారీ బ్యాటరీ, పెద్ద డిస్ప్లే, కొత్త Android Version కోరుకునే Budget Smartphone వినియోగదారులను ఈ మోడల్ ఆకర్షించే అవకాశం ఉంది.