క్రీడల అభివృద్ధికి రేవంత్ రెడ్డి సర్కార్ పెద్దపేట
జోనల్ స్థాయి క్రీడా పోటీలు ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ
సుల్తానాబాద్ సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): గతంలో ఎప్పుడు లేని విధంగా క్రీడల అభివృద్ధికి, క్రీడాకారుల సంక్షేమానికి రేవంత్ రెడ్డి(Revanth Reddy) సర్కార్ పెద్దపీట వేస్తుందని మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ అన్నారు, శుక్రవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం లో ఎస్ జి ఎఫ్ జోనల్ స్థాయి వాలీబాల్ , కోకో, కబడ్డీ, అథ్లెటిక్స్ పోటీలను ఆయన ప్రారంభించారు,
ముఖ్యఅతిథిగా పాల్గొన్న బిరుదు రాధాకృష్ణ మాట్లాడుతూ.. సుల్తానాబాద్ అంటేనే క్రీడలకు పుట్టినిల్లు అని, విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని కోరారు , ఈ జోనల్ స్థాయి క్రీడా పోటీల్లో అండర్ 14 , 17 బాలురు, బాలికలు పాల్గొన్నారు, ఇందులో జూలపల్లి, ఎలిగేడు, ఓదెల సుల్తానాబాద్ మండలాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం లో డివైఎస్ఓ సురేష్ , స్పోర్ట్స్ క్లబ్బు అధ్యక్షులు ముస్త్యాల రవీందర్, కౌన్సిలర్లు గాజుల రాజమల్లు, ఉట్ల వరప్రదీప్ , జోనల్ సెక్రెటరీ దాసరి రమేష్ , సీనియర్ క్రీడాకారులు అమీరీ శెట్టి తిరుపతి, కుమార్ కిషోర్, భైరగోని రవీందర్ గౌడ్, అంతటి సంతోష్ గౌడ్, బొల్లి సత్యం , గెల్లు మధుకర్ తో పాటు పీఈటీలు, క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు,