మార్కెట్ యార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
రుద్రంగి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla district) రుద్రంగి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు(Agricultural Market Yard)లో రైతుల సౌకర్యార్థం చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శుక్రవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ చేలుకల తిరుపతితో కలిసి శంకుస్థాపన చేశారు.మార్కెట్ యార్డు ఆవరణలో సీసీ రోడ్డు నిర్మాణంతో పాటు, రెండు నూతన ప్లాట్‌ఫారాల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 57 లక్షల 85 వేల నిధులను మంజూరు చేసింది.
భూమి పూజ నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(MLA Adhi Srinivas) మాట్లాడుతూ.. అన్నదాతలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ పనుల పూర్తితో పంట ఉత్పత్తుల కొనుగోలు, నిల్వ విషయంలో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు తొలగిపోతాయని తెలిపారు.రైతులకు మేలు చేసే మార్కెట్ కమిటీలా అభివృద్ధి కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. మంజూరైన నిధులతో పనులను నాణ్యతతో, త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను ఆయన ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో,సర్పంచ్ గండి నారాయణ,తహసీల్దార్ పుష్పలత, ఎంపిడిఓ నట్రజ్,ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్,మాజీ జడ్పిటిసి గట్ల మీనయ్య,డైరెక్టర్ అల్లూరి సంతోష్ రెడ్డి,పొద్దుపొడుపు లింగారెడ్డి,మండల అధ్యక్షుడు ఎర్రం గంగనర్సయ్య,ప్యాక్స్ చైర్మన్ ఏగోళం శ్రీనివాస్, డైరెక్టర్ సనుగుల గంగాధర్,వార్డు మెంబర్లు,శీలం మీనయ్య,పుదారి మహిపాల్,తుమ్మనపెళ్ళి నరేందర్,గసికంటి రాజు,ఆత్మకమిటి మెంబర్ కట్కూరి దాసు,ఎస్సి సెల్ అధ్యక్షుడు దయ్యాల శ్రీనివాస్,నాయకులు గడ్డం శ్రీనివాస్,తర్రే లింగం,కేసిరెడ్డి నర్సరెడ్డి, బైరి గంగామల్లయ్య,మార్కెట్ కమిటి డైరెక్టర్లు పాల్గొన్నారు.