మాలల ఐక్యవేదిక మండల అధ్యక్షుడిగా ఏడబోయిన రాజు ఏకగ్రీవం
20-09-2026 | 08:36pm
గంభీరావుపేట సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల మాలల ఐక్యవేదిక(Malala Ikya Vedika) కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా నర్మాల మాజీ సర్పంచ్ ఏడబోయిన రాజు, ఉపాధ్యక్షులుగా దోసల కార్తీక్, ప్రధాన కార్యదర్శి పల్నాటి దేవరాజ్, సహాయ కార్యదర్శి ఎగదండి అర్జున్, సభ్యులుగా అంజయ్య బాబు తదితరులుగా ఎన్నుకున్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని గాయత్రి ఫంక్షన్ హాల్ లో మాలల ఐక్యవేదిక నాయకులతో రోస్టర్ విధానం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.