రామస్వామిని అరెస్టు చేయాలి
- దళిత సంఘాల డిమాండ్.. పోలీసులకు వినతిపత్రం
కోనరావుపేట,(విజయక్రాంతి): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్(Dr. BR Ambedkar)పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కోనరావుపేట మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం(Ambedkar Youth Association) అధ్యక్షులు యాస శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చందుర్తి మండలం నర్సింగాపూర్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతపంటి రామస్వామిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రామస్వామి అంబేడ్కర్‌పై, దళితులపై అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.
అంబేడ్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కుల ద్వారానే ప్రజాప్రతినిధిగా ఎదిగిన వ్యక్తి అదే రాజ్యాంగ నిర్మాతను అవమానించడం సరికాదన్నారు. దళితులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని కూడా వారు ఆరోపించారు.రామస్వామిపై చట్టపరమైన చర్యలు తీసుకుని 24 గంటల్లో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాలని, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు స్పందించకపోతే ఈ నెల 30న సిరిసిల్లకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రానున్న నేపథ్యంలో నిరసన చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో దళిత, కుల సంఘాల నాయకులు, మల్యాల దేవయ్య, బావుసాయి పేట ఉప సర్పంచ్ తిక్కల నవీన్, మాదాసు భూమయ్య, పాతకాల రత్నం,మాందాల లింబయ్య,మాంధాల ప్రసాద్ బాబు, బత్తుల దీపక్, మందాల అభిషేక్, యాస భాస్కర్,గొట్టే రవీందర్,బత్తుల రవి, రణదీర్ తదితరులు పాల్గొన్నారు.