చినుకు పడిందా చిత్తాడిగ మారుతున్న రహదారి
రుద్రంగి సెప్టెంబర్ 16(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి(Rudrangi) మండలకేంద్రంలోని కస్తూర్బాగాంది పాఠశాలకు వెళ్లే దారి చినుకు పడితే చిత్తడిగా మారడంతో అటువైపు వెళ్లే రైతులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు గౌడ కులస్తులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని బిఆరెస్ వార్డు మెంబర్లు చెప్యాల గణేష్,ఉప్పలుటి గణేష్ ఆగ్రహం వ్యక్తంచేశారు.రైతులతో కలిసి బురదమయంగా మారినా దారిని పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ...పాఠశాల నుండి మెన్ రోడ్డు వరకు సిసి రోడ్డు పూర్తి అయింది కానీ మధ్యలో ఉన్న కల్వర్టు వద్ద పైప్ లైన్ వేయడం మారిచిపోవడంతో వర్షం పడినప్పుడు ఆ దారి మొత్తం బురదమయంగా మరి వాహనదారులకు ఇబ్బందిగా మారుతుందని అన్నారు.
వెంటనే అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి కల్వర్టు వద్ద పైప్ లైన్ నిర్మించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆ దారిలో కొబ్బరియాలు నిమ్మకాయలు చేతబడి చేసినట్టు పడేయడంతో విద్యార్థులు భయాందోళనలకు గురావుతున్నారని పాఠశాల ప్రాంతంలో ఇటువంటి పనులు చేయడం మనుకోవలని సూచించారు.
కల్వర్టు వద్ద పైప్ లైన్ వేయడం వల్ల ఆ ప్రాంత రైతులకు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు గౌడ కులస్తులకు మేలు జరుగుతుందని అన్నారు. కల్వర్టు నిర్మాణంలో జాప్యం చేయడం సరికాదని అన్నారు.