బీవీఆర్ఐటీలో 3డీ ప్రింటింగ్‌పై శిక్షణ

16-09-2026 | 11:12am

నర్సాపూర్ సెప్టెంబర్ 15: బీవీ రాజు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (BVRIT)లో 3డీ ప్రింటింగ్‌ అండ్‌ అడిటివ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌’పై ఐదు రోజుల హ్యాండ్స్‌-ఆన్‌ శిక్షణా కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. ఈ నెల 15 నుంచి 19 వరకు ఫార్మాస్యూటికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం, ఏఐసీటీఈ-ఐడియా ల్యాబ్‌, డిజైన్‌ ల్యాబ్స్‌ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.

కార్యక్రమానికి ఐఐటీ పాలక్కాడ్‌కు చెందిన డాక్టర్‌ కన్మణి సుబ్బు ఎస్. ముఖ్య అతిథిగా హాజరై 3డీ ప్రింటింగ్‌ సాంకేతికతలో పరిశోధన, ఆవిష్కరణలు, పారిశ్రామిక వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. శిక్షణలో 3డీ డిజైనింగ్‌, ప్రింటింగ్‌, ప్రోటోటైప్‌ అభివృద్ధిపై విద్యార్థులకు ప్రత్యక్ష శిక్షణ అందిస్తున్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంజయ్‌ దూబే, డైరెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మీ ప్రసాద్‌, డీన్‌ డాక్టర్‌ వి. మురళీకృష్ణ, విభాగాధిపతి డాక్టర్‌ పి. విష్ణు, డాక్టర్‌ ఎం. సుధీర తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు