సీఎంసీలోని అన్ని విభాగాలపై కమిషనర్ సమగ్ర సమీక్ష

25-10-2026 | 05:30am

పెండింగ్ సమస్యల పరిష్కారం అభివృద్ధి పనుల వేగవంతానికి ఆదేశాలు

శేరిలింగంపల్లి, అక్టోబర్ 24 (విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ)(Cyberabad Municipal Corporation) పరిధిలోని అన్ని విభాగాల పనితీరుపై కమిషనర్ శ్రీజను శనివారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, వివిధ శాఖల అధిపతులు, అధికారుల సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో పెండింగ్ ఫిర్యాదులు, కొనసాగుతున్న అభివృద్ధి పనులు, భవిష్యత్ కార్యాచరణ, ప్రజలకు అందుతున్న సేవలు తదితర అంశాలను సమీక్షించారు.

టౌన్ప్లానింగ్లో బిల్ నౌ దరఖాస్తులు, భూసేకరణ, కోర్టు కేసులు, ఇంజినీరింగ్లో రోడ్లు, పార్కులు, కూడళ్ల అభివృద్ధి, ఫుట్పాత్లు, వీధి దీపాలు, యూసీడీ ద్వారా మహిళా సంఘాలు, వీధి వ్యాపారుల సంక్షేమం, పట్టణ జీవవైవిధ్యం, చెత్త నిర్వహణ, పారిశుధ్యం, దోమల నివారణ, వాహనాల కొనుగోలు, చెరువుల్లో గుర్రపుడెక్క మొక్కల తొలగింపు వంటి అంశాలపై చర్చించారు. పెండింగ్ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, మంజూరైన పనులతో పాటు ప్రతిపాదిత కార్యక్రమాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.


మరిన్ని వార్తలు