సమయస్ఫూర్తితో విద్యార్థి ప్రాణాలు కాపాడిన పోలీసులు
27-11-2026 | 01:16pm
శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): ఆత్మహత్య(Suicide)కు యత్నించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(Hyderabad Central University)కి చెందిన 21 ఏళ్ల విద్యార్థిని గచ్చిబౌలి పోలీసులు(Gachibowli Police) సకాలంలో రక్షించారు. విద్యార్థి సూసైడ్ నోట్(Student suicide note) రాసి కనిపించడం లేదని స్నేహితుడు డయల్-100కు సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించిన పోలీసులు ఎల్ మెన్ హాస్టల్‌కు చేరుకుని మూడో అంతస్తు నుంచి దూకే ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అనంతరం విద్యార్థిని యూనివర్సిటీ వెల్ఫేర్ బృందానికి అప్పగించి కౌన్సెలింగ్, తదుపరి సంరక్షణకు చర్యలు తీసుకున్నారు.