గాంధీనగర్‌లో భయం.. భయం
- వరుసగా బయట పడుతున్న మానవ అవశేషాలు
- వణుకుతున్న స్థానికులు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
ఇబ్రహీంపట్నం రూరల్, నవంబర్ 22 (విజయక్రాంతి): ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam) పరిధిలోని గాంధీనగర్ కాలనీలో వరుసగా వెలుగుచూస్తున్న మానవ అవశేషాలు(Human remains) స్థానికులను తీవ్ర భయాందోళనకుగురిచేస్తున్నాయి. ప్రశాంతంగా ఉండే కాలనీలో మూడు రోజుల వ్య వధిలో ఒక మహిళ కాలి భాగం, ఆ వెంటనే ఒక మనిషి పుర్రె బయటపడటం కలకలం సృష్టించింది. ఇటీవల కాలనీలోని నిర్మానుష్య ప్రదేశంలో మూడు రోజుల క్రితం ఒక మహిళకు సంబంధించిన కాలి భాగం కనిపించింది.
ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతుండగానే, తాజాగా అదే ప్రాంతం లో ఒక మనిషి పుర్రె బయటపడటంతో కాలనీవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వీధి కుక్కలు ఆ అవశేషాలను పీక్కుతింటుండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన పోలీసులు..
సమాచారం అందుకున్న ఇబ్రహీంప ట్నం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరించా రు. లభ్యమైన అవశేషాలను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. నిందితుల కదలికలను పసిగట్టేందుకు పోలీసులు ఆ ప్రాంతంలో కొత్తగా సీసీ కెమెరాలను ఏర్పా టు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని పాత సీసీటీవీ ఫుటేజీలను జల్లెడ పడుతున్నారు.
పలు కోణాల్లో దర్యాప్తు..
బయటపడిన కాలు, పుర్రె ఒకే వ్యక్తివా లేక వేర్వేరు వ్యక్తులవా అన్నది తేలాల్సి ఉం ది. ఎక్కడో హత్య చేసి, ఆనవాళ్లు దొరక్కుం డా మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఇక్కడ పడేశారా? అనే కోణంలో పోలీసులు ము మ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. సమీప పోలీస్ స్టేషన్లలో ఇటీవల నమోదైన అదృశ్య కేసుల వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.వరుస ఘటనలతో గాంధీనగర్ వా సులు రాత్రి వేళల్లో బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా ఈ మిస్టరీని త్వరలోనే ఛేదిస్తామని పోలీసులు చెబుతున్నారు.