దేశాభివృద్ధిలో జీఎస్‌ఐ కీలక పాత్ర

11-11-2026 | 05:30am
  1. ఖనిజాల అన్వేషణలో పురోగతి సాధించాలి
  2. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి 
  3. నాగోల్ జీఎస్‌ఐలో హాస్టల్, ల్యాబ్ ప్రారంభం

ఎల్బీనగర్, నవంబర్ 10: భూగర్భ పరిశోధనలు(Geological investigations), జియోఫిజికల్ డేటా విశ్లేషణ(Geophysical Data Analysis), ఆధునిక సాంకేతిక శిక్షణతో జీఎస్‌ఐ ఖనిజాల(GSI minerals) అన్వేషణలో పురోగతి సాధించాలని, దేశాభివృద్ధిలో జీఎస్‌ఐ కీలక పాత్ర పోషించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

నాగోల్  బండ్లగూడలోని జీఎస్‌ఐ(జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) శిక్షణా సంస్థలో నలంద ఇంటర్నేషనల్ హాస్టల్, జియోఫిజికల్ డేటా ప్రాసెసింగ్ ల్యాబ్‌ను మంగళవారం మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌తో కలిసి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు.

అనంతరం ఆయా విభాగాలను సందర్శించి అక్కడ అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక సదుపాయాలు, వాటి పనితీరు, శిక్షణ కార్యక్రమాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జీఎస్‌ఐ శిక్షణ సామర్థ్యాన్ని మరింత పెంపొందించడంలో ఇవి కీలకంగా నిలుస్తుందని కిషన్‌రెడ్డి తెలిపారు.

భారతదేశంలో భౌగోళిక పరిశోధనలు, ఖనిజ వనరుల అన్వేషణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాభివృద్ధిని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నూతన శిక్షణ, సామర్థ్యాభివృద్ధి కేంద్రాలను ప్రారంభిస్తామని తెలిపారు. జీఎస్‌ఐ అధికారులు మాట్లాడుతూ... శిక్షణార్ధులకు ఇంటర్నేషనల్ హాస్టల్స్,  మెరుగైన వసతి సదుపాయాలు కల్పిస్తామన్నారు.

అడ్వానస్డ్ జియోఫిజికల్ డేటా ప్రాసెసింగ్ లాబొరేటరీ,  ఆధునిక భౌగోళిక పరిశోధనలు, డేటా విశ్లేషణకు అత్యాధునిక సాంకేతిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. దేశంలో ఖనిజ రంగ అభివృద్ధి, పరిశోధన సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడంలో నూతన సదుపాయాలు కీలకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ దినేష్ వి.గన్వి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు  వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎల్బీనగర్ ఇన్‌చార్జి సామ రంగారెడ్డి, మాజీ కార్పొరేటర్లు నవజీవన్ రెడ్డి, కొప్పుల నర్సింహా రెడ్డి, చింతల అరుణ సురేందర్ యాదవ్, బీజేపీ నాయకులు సిద్ధాల ఐలయ్య, సంజీవరెడ్డి, పంగ శ్యామ్‌కుమార్, నూకల పద్మారెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు