వెలిమెలలో అయ్యప్ప వైభవం.. మారుమోగిన శరణుఘోష!

22-11-2026 | 08:31pm

శ్రీకాంత్ గురుస్వామి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మహాపడి పూజ

మణికొండ, నవంబర్ 22 (విజయక్రాంతి): వెలిమెల గ్రామంలో(Velimela Village) అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. శ్రీకాంత్ గురుస్వామి(Srikanth Guruswamy) ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప మహాపడి పూజ అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో(devotional) కన్నుల పండువగా సాగింది. అయ్యప్ప దీక్షా నియమాలను పాటిస్తూ, భక్తిని చాటుకుంటూ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన శ్రీకాంత్ గురుస్వామి భక్తుల(devotees) ప్రశంసలు అందుకున్నారు. గురుస్వాముల పర్యవేక్షణలో సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

‘స్వామియే శరణమయ్యప్ప’ అంటూ మారుమోగిన శరణుఘోషతో వెలిమెల గ్రామంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తిపారవశ్యంలో మునిగిపోయాయి. పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

మరిన్ని వార్తలు