కార్మికుడి కుటుంబానికి అండగా గూడెం మధుసూదన్ రెడ్డి

03-11-2026 | 12:18pm

పటాన్‌చెరు: విద్యుత్ షాక్‌తో మృతి చెందిన బీహార్‌కు చెందిన 19 ఏళ్ల కార్మికుడు వినయ్ కుమార్ కుటుంబాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి(BRS leaders Gudem Madhusudan Reddy), మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్(Yadagiri Yadav) పరామర్శించి అండగా నిలిచారు. కుటుంబానికి ధైర్యం చెప్పి అంత్యక్రియల ఖర్చుల కోసం ఆర్థిక సాయం అందించారు. కార్మికుడు పనిచేస్తున్న పారగాన్ పరిశ్రమ యాజమాన్యం మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయం అందించాలని, విద్యుత్ శాఖ తరఫున నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

మరిన్ని వార్తలు