సూర్యాపేటలో ఏసీబీ అధికారుల దాడులు
జిహెచ్ఎంసి అసిస్టెంట్ డైరెక్టర్ యాదగిరిరావు ఇంట్లో సోదాలు
సూర్యాపేట,(విజయక్రాంతి): సూర్యాపేట పట్టణంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్/మెప్మా అదనపు డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న నల్లబోతు యాదగిరిరావు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఆయన నివాసాలే లక్ష్యంగా ఈ సోదాలు జరుగుతున్నాయి.
సూర్యాపేట పట్టణంలోని సాయిబాబా గుడి సమీపంలో ఉన్న యాదగిరిరావు సొంత నివాసంతో పాటు, గాంధీనగర్లోని ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి. ఈ సందర్భంగా కీలక పత్రాలు, ఆస్తి వివరాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. సోదాలు ముగిసిన అనంతరం ఏసీబీ ఉన్నతాధికారులు పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.