గొర్రెల కాపరులకు ఫంక్షన్ ఇవ్వాలి
జిఎంపిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బొల్లం అశోక్
తుంగతుర్తి,(విజయ క్రాంతి): 50 సంవత్సరాలు నిండిన గొర్రెల కాపరులకు మిగతా వృత్తిదారుల లాగా 5వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బొల్లం అశోక్(GMPS State Assistant Secretary Bollam Ashok) ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలో జిఎంపిఎస్ మండల అధ్యక్షులు వీరబోయిన రాములు అధ్యక్షతన గ్రామంలో గొర్రెలు మేకల పెంపకం దారుల స్థితిగతులు తెలుసుకోవడం కోసం జిఎంపిఎస్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో సర్వే నిర్వహించి, గొర్ల కాపరుల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా పాల్గొన్న రాష్ట్ర సహాయ కార్యదర్శి బొల్లం అశోక్, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య లు మాట్లాడుతూ, కరువు నెలకొన్న పరిస్థితుల్లో గొర్రెల, మేకలకు మేత, నీరు సమస్యలు తీవ్రంగా ఉన్నాయని పెంపకం దారులు ఆందోళన చెందుతున్నారని వారి సందర్భంగా అన్నారు. అన్ని కష్టలుపడి గొర్రెలు మేపిన కూడా సరైనటువంటి ప్రభుత్వ వైద్యం అందక, ప్రవేట్ వైద్యంతో వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుందని సర్వే సందర్భంగా వచ్చింది.
గొర్రెలు మేపే పనిలో రోజు పదుల కిలోమీటర్ల దూరం నడవాల్సిన పరిస్థితి వస్తుందని దానివల్ల మోకాళ్ళ నొప్పులు వచ్చి, తక్కువ వయసులోనే గొర్రెలను మేపలేని స్థితిలోకి వస్తున్నారని కావున గొర్రెల పెంపకం దారులకు 50 సంవత్సరాలు నిండిన వారందరికీ ఐదు వేల రూపాయల వృత్తిదారుల పెన్షన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశార. ఈ కార్యక్రమంలో జిఎంపిఎస్ మండల కార్యదర్శి బొమ్మరబోయిన శ్రీనివాస్ , కొమ్మ లింగయ్య, మట్టపల్లి శ్రీను, ఉప్పుల లింగయ్య, నాగమల్లు బిక్షం నరసయ్య భిక్షం బోయిన మల్లయ్య నాగరాజు, తోడేటి కొమురయ్య బొడ్డు ముత్తయ్య నాలబాల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.