వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్ చెరు: ఇంద్రేశం మున్సిపల్(Indresham Municipality) పరిధిలోని చిన్నకంజర్ల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్షాకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఉదయం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
ప్రభుత్వం తరఫున కొనుగోలు కేంద్రాలలో అందిస్తున్న వసతులను రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులు తమ ధాన్యాన్ని దళారులకు విక్రయించవద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం. కొనుగోలు చేసిన ధాన్యానికి నిర్ణీత గడువులోగా డబ్బులు చెల్లించాలని కోరారు. రైతులకు బకాయి పడిన బోనస్ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రను వీడాలని డిమాండ్ చేశారు.