అక్రమ మైనింగ్ ను అరికట్టాలి

10-10-2026 | 09:47pm

జహీరాబాద్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా(Sangareddy district) న్యాల్కల్ మండల పరిధిలో అక్రమ మైనింగ్(Illegal Mining)ను అరికట్టాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై నరోత్తం(Former Telangana SC Corporation Chairman Y. Narottam) అన్నారు. న్యాల్కల్ మండలం గణేష్ పూర్ లో మైనింగ్ దందా నడుస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. జహీరాబాద్ ప్రాంతంలో ఏర్పాటు అవుతున్న జాతీయ పెట్టుబడి ఉత్పత్తులు ఉత్పాదక సంస్థ సేకరించిన భూమిలో మైనింగ్ చేయడం ఎంతవరకు సమంజసం అని ఆయన తెలిపారు.

ఇంతకుముందు ఈ భూములలో రెవెన్యూ అధికారులు ఈ మైనింగ్ జరుపుతున్న ప్రాంతాన్ని మూళ్ళకంచతో ఎవరు వెళ్లకుండా ఏర్పాటు చేయగా కొన్ని రోజులు స్తబ్దతగా ఉన్న మైనింగ్ మాఫియా ఫెన్సింగ్ వైర్ల(Mining mafia fencing wires)ను తొలగించి మళ్లీ మైనింగ్ ప్రారంభించారని ఆయన తెలిపారు. గణేష్ పూర్ లో అక్రమ మైనింగ్ ను అరికట్టవలసిన మైనింగ్ అధికారులు. రెవెన్యూ అధికారులు మైనింగ్ మాఫియా ఇచ్చే మామూళ్లకు తలకి మైనింగ్ చర్య తీసుకోవడం లేదని ఆయన అన్నారు. మండల జిల్లా అధికారులు స్పందించి మైనింగ్ మాఫియా పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు