బాధిత కుటుంబానికి ఆర్థిక చేయూత
05-11-2026 | 04:42pm
కోహెడ, నవంబర్ 5 (విజయక్రాంతి): మండల కేంద్రానికి చెందిన మార్క రాజమౌళి (36) ఇటీవల పాము కాటుకు గురై మృతి చెందిన విషయం విధితమే. కాగా గురువారం స్థానిక ప్రభుత్వ సాంఘిక సంక్షేమ పాఠశాల(Local Government Social Welfare School) /కళాశాల ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సిబ్బంది బాధిత కుటుంబానికి రూ.1 లక్ష 5 వేలు ఆర్థిక సాయం అందించారు. ఈ మొత్తాన్ని మృతుని కూతురు సాత్విక పేరు మీద ఫిక్స్ డ్ డిపాజిట్ చేసి బాండ్ ను అందించారు.