నకిలీ విత్తనాల కంపెనీ పై చర్యలు తీసుకోవాలి రుయ్యాడి రైతులు

01-10-2026 | 06:44pm

తలమడుగు అక్టోబర్ 1(విజయక్రాంతి) :తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామ రైతులు విగర్ మాళవిక సీడ్స్ కంపెనీపై (Vigor Malavika Seeds Company)పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంపెనీ అందించిన విత్తనాలు సాగు చేసిన తర్వాత పంటలో మొలకలు రావడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు తెలిపారు. సుమారు 400 ఎకరాలు సోయా పంట వేయడం జరిగిందని అన్నారు.

దాదాపు 55 మంది రైతులు తమ పంట నష్టానికి కారణమైన కంపెనీపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ రెడ్డి, నిత్యడి గంగాధర్ మల్లేష్, పోతరెడ్డి,ప్రకాశ్ రెడ్డి సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,లస్మా రెడ్డి రాజేశ్వర్, రూయ్యాడి గ్రామ రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు