ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయాలి...

06-10-2026 | 06:01pm

సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు డిమాండ్

దామరచర్ల :అక్టోబర్ :6 :ఎన్నికల మ్యానిఫెస్టో ను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని(Congress government) సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు లకపాకరాజు(CITU District Vice-President Lakapakaraju) డిమాండ్ చేశారు.దామరచర్ల ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం జరిగిన మండల ఆశా వర్కర్స్ విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు.

 కాంగ్రెస్ పార్టీ  ఎన్నికలకు ముందు ఆశా కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్న టెంట్ల వద్దకు వచ్చి మీ డిమాండ్స్ న్యాయమైనవి వచ్చేది మా ప్రజా ప్రభుత్వం మీ డిమాండ్స్ నెరవేరుస్తాం అని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజుల సంబరాలు జరుపుకున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మాటలు నీటి మూటలు గానే మిగిలిపోయాయి అన్నారు,

రాష్ట్రంలో కాంగ్రెస్ కేంద్రంలో బిజెపి ప్రభుత్వాలు చూడటానికి వేరుగా ఉన్న కార్మికులయడల ఒకే రకమైనటువంటి వైఖరిని కలిగి ఉన్నాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అక్టోబర్ 26 హైదరాబాద్, డిసెంబరు 1,2,3 తారీకులలో చలో ఢిల్లీ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బైరందయానంద్ మాట్లాడుతూ కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని పని భద్రత బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఉమామహేశ్వరి , ప్రధాన కార్యదర్శి ఎస్ జయమ్మ , సబ్ సెంటర్ లీడర్స్ శారద, గౌస్య. ఉమా. తులసి. విజయ శ్రీదేవి. హుస్సేనమ్మ పద్మ .తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు