చేజారిన భారత్ ఏ విజయం

28-10-2026 | 05:10am
  1. కివీస్‌ను కాపాడిన బ్యాడ్ లైట్ 
  2. తొలి అనధికారిక టెస్ట్ డ్రా

లింకోన్, అక్టోబర్ 27 : న్యూజిలాండ్ ఏ జట్టుతో(New Zealand A team) జరిగిన తొలి అనధికారిక టెస్టులో భారత్ ఏ(Bharat A) విజయం తృటిలో చేజారింది. వెలుతురు లేమి కారణంగా ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. చివరి సెషన్‌లో భారత్ విజయానికి 1 వికెట్ కావాల్సి ఉండగా బ్యాడ్ లైట్‌తో మ్యాచ్ నిలిపివేశారు. ఈ మ్యాచ్‌లో గెలవకున్నా భారత్ ఏ అద్భుత ంగా పుంజుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ ఏ కేవలం 113 పరుగులకే ఆలౌట్ కాగా, న్యూజిలాండ్ ఏ 317 పరుగులు చేసి 204 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది.

రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు అద్భుతంగా పుంజుకుని 516 పరుగుల భారీ స్కోరు చేసింది. స్టార్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ 199 పరుగులు చేసి తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. సాయి సుదర్శన్, యశ్ రాథోడ్, వాషింగ్టన్ సుందర్ అర్ధ సెంచరీలతో రాణించారు. భారత్ నిర్దేశించిన 313 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలా ండ్ ‘ఎ’ 187 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. న్యూజిలాండ్ బ్యాటర్ కర్టిస్ హీఫీ (90 నాటౌట్) ఒంటరి పోరాటం చేస్తూ చివరి వికెట్‌కు జైడెన్ లెనాక్స్తో కలిసి భారత బౌలర్లను ప్రతిఘటించాడు. మ్యాచ్ ముగియడానికి మరో 17 ఓవర్ల ఆట మిగిలి ఉండగా వెలుతురు మందగించడంతో అంపైర్లు మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు.

మరిన్ని వార్తలు